న్యూఇయర్‌కు విజయ్ యాంటొనీ స్పెషల్ గిఫ్ట్

న్యూఇయర్‌కు విజయ్ యాంటొనీ స్పెషల్ గిఫ్ట్

విజయ్ యాంటొనీ కొత్తగా చేస్తున్న సినిమా విజయ రాఘవన్ సినిమా టీజర్ విడుదల కానుంది. ఈ సినిమా టీజర్‌ను నూతన సంవత్సర కానుకగా నాలుగు భాషల్లో రిలీజ్ చేయన్నారు. తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఈ టీజర్ విడుదలవుతుంది. ఈ టీజర్ జనవరీ 2 మధ్యహ్నం 2గంటల 1నిమిషానికి విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన ఆత్మికా చేసింది. ఈ చిత్రం ఆనంద కృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే విజయ్ మొదటగా మ్యూజిక్ కంపోజర్‌గా తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. తరువాత సొంత కథలు రాశాడు. అలా తనలోని అనే ప్రతిభలను ప్రేక్షకులకు చూపి ఆకట్టుకున్నాడు. సింగర్, మ్యూజిక్ డైరెక్టర్, యాక్టర్, రైటర్ ఇలా మరెన్నో ప్రతిభలు అతడిలో ఉన్నాయి. ఈ మల్టీ ట్యాలెంటెడ్ హీరో సలీం అనే థ్రిల్లర్ సినిమాతో తెలుగులో పరిచయం అయ్యాడు. ఈ సిమాతో పెద్దగా పేరు రాకపోయినా, దీని తరువాత విడుదలైన బిచ్చగాడు సినిమాతో తెలుగులో కూడా చెప్పుకోదగ్గ మార్కెట్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం విజయ్ చేస్తున్న విజయరాఘవన్ చిత్రీకరణలో ఉంది. మరి ఈ సినిమాతో ఎంతమందిని తన అభిమానులుగా మార్చుకుంటాడో చూడాలి.