ఆ హీరో సినిమా రైట్స్ 60 కోట్లు !

ఆ హీరో సినిమా రైట్స్ 60 కోట్లు !

దక్షిణాది స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే 'తేరి, మెర్సల్' లాంటి హిట్ సినిమాలు వచ్చి ఉండటంతో ఈ సినిమాపై తారాస్థాయి  అంచనాలున్నాయి.  అందుకే సినిమా యొక్క శాటిలైట్, డిజిటల్ హక్కులు భారీ ధర పలికాయి.  ప్రముఖ టీవీ ఛానెల్ సన్ టీవీ అన్ని భాషల్లో కలిపి ఈ హక్కుల్ని 60 కోట్లకు దక్కించుకుందట.  నయనతార  కథానాయకిగా నటిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాకు ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.