వచ్చే దీపావళికి విజయ్ సందడి షురూ..!!
ఈ దీపావళి వచ్చిన సర్కార్ సినిమా సూపర్ హిట్ అయింది. కొన్ని వివాదాస్పద సన్నివేశాలతో మరింత కిక్ ఇచ్చింది. ఇప్పటికే రూ.150 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిన ఈ సినిమా రూ.200 కోట్ల రూపాయలు వసూలు చేసే దిశగా పరుగులు తీస్తున్నది. విజయ్ 63 వ సినిమా గురించిన తాజా సమాచారం బయటకు వచ్చింది.
తేరి, మెర్సల్ వంటి సినిమాలు చేసిన అట్లీ తలపతి విజయ్ తో మూడో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. ఏజీఎస్ సినిమాస్ నిర్మిస్తున్న ఈ సినిమా పొంగల్ నుంచి ప్రారంభం కానున్నది. వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ చేస్తారట. కోలీవుడ్ లో టాప్ క్రూ ఈ సినిమాకు పనిచేయబోతున్నది. రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు జీకే విష్ణు ఫోటోగ్రఫి అందిస్తున్నారట.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)