ఆసక్తిని పెంచుతున్న విజయ్.. అట్లీ టైటిల్..!!

ఆసక్తిని పెంచుతున్న విజయ్.. అట్లీ టైటిల్..!!

విజయ్ సర్కార్ సినిమా తరువాత తనకు కెరీర్లో రెండు బెస్ట్ హిట్స్ ఇచ్చిన అట్లీతో సినిమాచేయబోతున్నాడు .  గతంలో వీరిద్దరి కాంబినేషన్లో తేరి, మెర్సల్ సినిమాలు వచ్చాయి.  ఈ రెండు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.  ఇప్పుడు వీరి కాంబినేషన్లో మూడో సినిమా తెరకెక్కబోతున్నది.  

విజయ్ ను ఈసారి కోచ్ గా చూపించబోతున్నాడు.  విజయ్ కోచ్ పాత్రలో కనిపిస్తున్నాడు అని తెలియగానే ఒక్కసారిగా సినిమాకు బజ్ క్రియేట్ అయింది.  మెర్సల్ సినిమా యావరేజ్ గా నిలిచినా.. భారీ వసూళ్లు సాధించడంతో.. నెక్స్ట్ సినిమాపై ఆసక్తి క్రియేట్ అయిన సంగతి తెలిసిందే.  విజయ్.. అట్లీ సినిమాకు మైఖేల్ అనే టైటిల్ ను అనుకుంటున్నట్టు తెలుస్తోంది.  ఫైనల్ గా ఎలాంటి టైటిల్ ను పెడతారో చూద్దాం.