విజయ్ దేవరకొండ మొదలుపెట్టాడు..!!

విజయ్ దేవరకొండ మొదలుపెట్టాడు..!!

అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్నైట్ స్టార్ గా మారిన విజయ్ దేవరకొండ.. ఇప్పుడు టాలీవుడ్ లో వరసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. అర్జున్ రెడ్డి యూత్ కు నచ్చితే.. గీత గోవిందం ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది.  వంద కోట్ల రూపాయల క్లబ్ లో చేరిపోయింది.  దీంతో ఈ స్టార్ హీరోకు డిమాండ్ పెరిగింది.  

ఇప్పుడు హీరో రష్మికతో డియర్ కామ్రేడ్ చేస్తున్నారు.  ఈ సినిమా జులై 26 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.  అంటే ఇంకా సినిమా రిలీజ్ కు 50 రోజుల సమయం ఉంది.  ఈ యాభై రోజుల పాటు ఈ సినిమాను భారీ ప్రమోషన్ ను చేయబోతున్నారు.