టాలీవుడ్‌లో మరో భారీ మల్టీస్టారర్ ?

టాలీవుడ్‌లో మరో భారీ మల్టీస్టారర్ ?

ఇతర భాషలతో పోలిస్తే మన టాలీవుడ్‌లో మల్టీస్టారర్‌ మూవీలు చాలా తక్కువగా వస్తుంటాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టాలీవుడ్‌ హీరోలు కూడా మల్టీస్టారర్‌కు ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే టాలీవుడ్‌లో మరో క్రేజీ మల్టీస్టారర్‌ సినిమా రానున్నట్లు టాక్‌ నడుస్తోంది. స్టయిలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, విజయ దేవరకొండ కలిసి ఓ మూవీలో కలిసి నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. "యాత్ర" ఫేం మహేష్‌ వి.రాఘవ్‌ వీళ్లద్దరి కోసం ఓ స్క్రిప్టు సిద్ధం చేశాడట. ఈ కథ దాదాపు ఫైనల్‌ అయినట్లేనట. ఈ సినిమాను బన్నీ వాసు, అల్లు అరవింద్‌ సంయుక్తంగా నిర్మించనున్నారని టాక్‌ నడుస్తోంది. 2021 చివర్లో ఈ మల్టీస్టారర్‌ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందట. కాగా.. ప్రస్తుతం అల్లుఅర్జున్‌.... లెక్కల మాస్టర్ సుకుమార్‌తో "పుష్ప" సినిమా చేస్తున్నాడు.  గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారు. అయితే ఇందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న పోలీస్‌గా తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతిని ఖరారు చేశారు. అటు విజయ్‌ దేవరకొండ.. పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో "లైగర్‌" సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా షూటింగ్‌ దశలోనే ఉంది. ఈ రెండు సినిమాల తర్వాత విజయ్‌, బన్నీ కాంబోలో సినిమా ప్లాన్‌ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.