విజయ్ ద్వారకా అర్జున్ రెడ్డి

విజయ్ ద్వారకా అర్జున్ రెడ్డి

విజయ్ దేవరకొండకు టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోను ఫ్యాన్స్ ఉన్నారు.  అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిన విజయ్ తమిళంలో నోటా సినిమాతో పరిచయం అయ్యాడు.  ఇప్పుడు తెలుగులో రిలీజైన సినిమాలు తమిళంలో రిలీజ్ కాబోతున్నాయి.  అందులో ఒకటి ద్వారకా సినిమా.  ఈ సినిమా తెలుగులో యావరేజ్ గా నిలిచింది. 

ఈ సినిమాను తమిళంలో అర్జున్ రెడ్డి పేరుతో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు.  ఈ శుక్రవారం రోజున తమిళనాడులో భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమాపై అక్కడ అంచనాలు భారీగా ఉన్నాయి.  మరి ఈ సినిమాను తమిళ ప్రజలు ఎలా ఆదరిస్తారో చూడాలి.