అక్కడ చరణ్ ను మించిపోయిన విజయ్ దేవరకొండ..!!

అక్కడ చరణ్ ను మించిపోయిన విజయ్ దేవరకొండ..!!

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు.  ఊహించిన దానికంటే ఎక్కువ విజయాలు నమోదు చేసుకుంటూ.. మిగతా హీరోలకు షాక్ ఇస్తున్నాడు.  తాజాగా, విజయ్ నటించిన డియర్ కామ్రేడ్ సినిమా ఈరోజు రిలీజ్ అయ్యింది.  యూఎస్ లో ఇప్పటికే ప్రీమియర్ షోలు ముగిశాయి.  ఈ ప్రీమియర్స్ ద్వారా డియర్ కామ్రేడ్ 2.5 లక్షల డాలర్లను వసూలు చేసింది.  ఇది రామ్ చరణ్ వినయ విధేయ రామ ప్రీమియర్ కలెక్షన్ల కంటే ఎక్కువ.  

ఒక యంగ్ హీరో సినిమా ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం గొప్ప విషయంగా చెప్పాలి. ఈ ఏడాది ప్రీమియర్ ద్వారా మహర్షి - 5.16 లక్షల డాలర్లు, ఎన్టీఆర్ కథానాయకుడు - 4.83 లక్షల డాలర్లు, ఎఫ్ 2 - 2.59 లక్షల డాలర్లు వసూలు చేశాయి.  ఈ  మూడు డియర్ కంటే ముందున్నాయి.  సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తుండటంతో రాబోయే రోజుల్లో ఏ మేరకు వసూళ్లు సాధిస్తుందో చూడాలి.