మహేష్, చిరంజీవికి షాకివ్వబోతున్న విజయ్ దేవరకొండ..!!

మహేష్, చిరంజీవికి షాకివ్వబోతున్న విజయ్ దేవరకొండ..!!

విజయ్ దేవరకొండ గీత గోవిందం విడుదలైన అన్ని చోట్ల విజయకేతనం ఎగురవేస్తూ దూసుకుపోతున్నది. మూడు వారాల్లోనే రూ.100 కోట్లు వసూళ్లు చేసి దూసుకుపోతున్నది.  గతవారం పెద్ద సినిమాలు ఏవి లేకపోవడం.. విడుదలైన సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో.. గీత గోవిందానికి తిరుగులేకుండా పోయింది.  

నైజాంలో ఈ సినిమా 18.60 కోట్లు షేర్ వసూలు చేసి రికార్డ్ సృష్టించింది.  ఇప్పటికే ఎన్టీఆర్  జనతా గ్యారేజ్ సినిమాను బీట్ చేసిన గీత, మరో కోటి వసూలు చేస్తే.. మహేష్ బాబు రంగస్థలం, చిరంజీవి ఖైదీ నెంబర్ 150 ను బీట్ చేసే అవకాశం ఉన్నది.  సెప్టెంబర్ 13 వరకు పెద్ద సినిమాలు లేకపోవడంతో గీత గోవిందానికి ఫెచ్చింగ్ అవుతుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.