అక్కడ మహేష్ తరువాత.. విజయ్ దేవరకొండకే క్రేజ్ ఎక్కువ..!!

 అక్కడ మహేష్ తరువాత.. విజయ్ దేవరకొండకే క్రేజ్ ఎక్కువ..!!

విజయ్ దేవరకొండ గీత గోవిందం కలెక్షన్ల సునామి సృష్టిస్తున్నది.  ఇప్పటికే రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన గీత, మరిన్ని సంచలనాలను సృష్టించేందుకు సిద్దమౌతున్నది.  తెలుగుతో పాటు అటు తమిళంలోకు కూడా ఈ సినిమాను డబ్ చేసి రిలీజ్ చేశారు.  తమిళనాడులో ఈ సినిమా ఇప్పటి వరకు రూ.5 కోట్లు  వసూలు చేసి నాన్ బాహుబలి రికార్డ్ ను సొంతం చేసుకున్నది.  మహేష్ బాబు తరువాత తమిళనాడులో అంతటి క్రేజ్ సంపాదించుకున్న టాలీవుడ్ హీరోగా విజయ్ దేవరకొండ రికార్ట్ సృష్టించాడు.  క్యూట్, రొమాంటిక్ కల్ట్ లవ్ స్టోరీకి తమిళనాడు యువత ఎట్రాక్ట్ అవుతున్నది.