బరిలోకి విజయ్ దేవరకొండ కూడా !

బరిలోకి విజయ్ దేవరకొండ కూడా !

 

ఈ మార్చి నెలలో చాలా సినిమాలే విడుదలకానున్నాయి.  '118' మొదలుకుని 'ఏబిసిడి, ప్రేమకథా  చిత్రం 2, లక్ష్మీస్ ఎన్టీఆర్, సూర్యకాంతం, అర్జున్ సురవరం' లాంటి సినిమాలు రిలీజవుతున్నాయి.  ఈ పోటీలోకి విజయ్ దేవరకొండ కూడా చేరాడు.  ఆయన తాజా చిత్రం 'డియర్ కామ్రేడ్' మార్చి 22న విడుదలవుతుందని తెలుస్తోంది.  భరత్ కమ్మ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాను మైత్రీ  మూవీస్ నిర్మిస్తోంది.  గతంలో దేవరకొండతో కలిసి 'గీత గోవిందం' సినిమా చేసిన రష్మిక మందన్న ఇందులో కథానాయిక.