విజయ్ దేవరకొండ మరొక పవర్ స్టార్ !

విజయ్ దేవరకొండ మరొక పవర్ స్టార్ !

ఈ మధ్య కాలంలో మన ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయిన హీరో విజయ్ దేవరకొండ.  'పెళ్లి చూపులు'తో మొదలైన ఇతగాడి హడావుడి 'అర్జున్ రెడ్డి'తో ఊపందుకుని తాజాగా విడుదలైన 'గీత గోవిందం'తో తారా స్థాయికి చేరుకుంది.  ఎప్పటికప్పుడు తన నటనతో, యాటిట్యూడ్ తో యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు విజయ్. 

నిన్న జరిగిన 'గీత గోవిందం' ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ గత 15 ఏళ్ళల్లో చాలా మంది స్టార్లు వచ్చారు.. కానీ తొలిప్రేమతో పవన్ ఎలా స్టార్ గా ఎదిగాడో ఇప్పుడు గీత గోవిందంతో విజయ్ దేవరకొండ అలా స్టార్ అయ్యాడు.  అతనికి మంచి ఫ్యూచర్ ఉంది అంటూ తెగ పొగిడేశారు.