కింగ్ ఆఫ్ ది హిల్ కు హీరోయిన్ సెట్ అయ్యింది

కింగ్ ఆఫ్ ది హిల్ కు హీరోయిన్ సెట్ అయ్యింది

పెళ్లి చూపులు సినిమాతో సోలో హిట్ అందుకున్నాక విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమా చేశాడు.  ఈ సినిమా భారీ హిట్ కొట్టడంతో పాటు యూత్ లో యమా క్రేజ్ ను సొంతం చేసుకుంది.  సినిమా విజయం తరువాత విజయ్ తిరిగి చూసుకోలేదు.  కెరీర్లో చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ... భారీ హిట్స్ కొడుతూ దూసుకుపోతున్నాడు.  తాజాగా ఈ హీరో ఓ ప్రొడక్షన్ సంస్థను స్థాపించి సినిమాలు తీయడం మొదలుపెట్టాడు.  

ఇందులో భాగంగా తనకు మొదటి సోలో హిట్ ఇచ్చిన పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ ను హీరోగా పరిచయం చేస్తూ సినిమా తీస్తున్నాడు. సమీర్ దర్శకుడు.  ఇందులో హీరోయిన్ గా తమిళ సీరియల్ నటి వాణి భోజన్ ను సెలెక్ట్ చేశారు.  దేవమగళ్ సీరియల్ తో తమిళనాడులో సూపర్ ఫేమస్ అయ్యింది వాణి భోజన్.  మరి ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.