రౌడీ హీరో మార్కెట్ పడిపోతుందా..? 

రౌడీ హీరో మార్కెట్ పడిపోతుందా..? 

ఇండస్ట్రీలో అంతో ఇంతో పేరు ఉన్న హీరోల సినిమాలు విడుదల అవుతున్నాయంటే మినిమమ్ కలెక్షన్స్ వస్తాయి. అదే స్టార్ హీరో సినిమా అయితే అది ఎలా ఉన్న ఈ మధ్య 100కోట్లు దాటుతుంది. ఓపినింగ్సే హీరో స్టామినా ఏంటో చూపిస్తున్నాయి.కానీ ఈ కుర్ర హీరోకి మాత్రం అంత రివర్స్ లో జరుగుతుంది. టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోగా వచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోల జాబితాలో చేరిపోయాడు విజయ్. తాజాగా'వరల్డ్ ఫెమస్ లవర్'గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ కుర్ర హీరో.  అయితే ఈ సినిమా అభిమానులను దారుణంగా నిరాశపరిచింది. మొదటి షోకే డివైడ్ టాక్ రావడంతో ఆ ప్రభావం కలెక్షన్స్ పై పడింది. విజయ్ గత చిత్రం 'డియర్ కామ్రేడ్' కంటే దాదాపు ముప్పై శాతం కలెక్షన్స్ తగ్గడం గమనార్హం.అర్జున్ రెడ్డి, గీతగోవిందం లాంటి సినిమాలు వరుసగా విజయం సాధించడంతో విజయ్ సినిమా పై అభిమానులు అంచనాలు పెంచుకున్నారు.కానీ విజయ్ ఆఅంచనాలను అందుకోలేక పోతున్నాడు. వరల్డ్ ఫెమస్ లవర్ సినిమా  మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు కోట్ల రూపాయల షేర్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రెండో రోజు కలెక్షన్స్ మరింతగా డ్రాప్ అయ్యాయని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.