మెగాస్టార్ టైటిల్ తో విజయ్ సినిమా..!!

మెగాస్టార్ టైటిల్ తో విజయ్ సినిమా..!!

మెగాస్టార్ హీరోగా చేసిన హీరో సినిమా ఎలాంటి విజయం సాధించిందో చెప్పక్కర్లేదు.  ఈ టైటిల్ తో ఆ తరువాత కొంతమంది హీరోలు సినిమాలు చేసినా పెద్దగా కలిసిరాలేదు.  ఈ టైటిల్ తో ఇప్పుడు అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ సినిమా చేస్తున్నారు.  

మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.  ఆనంద్ అన్నామలై దర్శకత్వం వహిస్తున్నారు.  దక్షిణాది నాలుగు భాషల్లో ఈ సినిమా తెరకెక్కబోతున్నది.  ఏప్రిల్ 22 న ఢిల్లీలో ఈ సినిమా ప్రారంభం కాబోతున్నది.  మిగతా వివరాలను త్వరలోనే ప్రకటిస్తారు.