కియారాకు అర్జున్ రెడ్డి గిఫ్ట్.. ఏంటో తెలుసా?

కియారాకు అర్జున్ రెడ్డి గిఫ్ట్.. ఏంటో తెలుసా?

తెలుగులో సూపర్ హిట్టైన అర్జున్ రెడ్డి సినిమాను బాలీవుడ్ లో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేశారు.  సందీప్ రెడ్డి వంగ దర్శకుడు. విజయ్ పోషించిన పాత్రను హిందీలో షాహిద్ కపూర్ చేయగా, షాలిని పాండే పాత్రను కియారా చేసింది.  షాలిని కంటే కియారా ఎమోషన్ ను బాగా పండించినట్టు బాలీవుడ్ సినిమా విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.  

ముద్దు సన్నివేశాల్లో ఏ మాత్రం బెరుకు లేకుండా నటించి మెప్పించింది.  ఇది సినిమాకు ప్లస్ అయ్యింది.  కబీర్ సింగ్ గా షాహిద్ కపూర్ నూటికి నూరుపాళ్లు న్యాయం చేశారు.  బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ వసూళ్ల సునామీని సృష్టిస్తోంది.  ఇప్పటికే దాదాపుగా రూ.160 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది.  కబీర్ సింగ్ విజయానికి గుర్తుగా విజయ్ దేవరకొండ కియారకు కిక్ ఇచ్చే గిఫ్ట్ పంపించాడు.  

కబీర్ సింగ్ విజయాన్ని ఆస్వాదించు.. నాకు ఏంటో ఇష్టమైన డ్రెస్ ను గిఫ్ట్ కింద ప్రజెంట్ చేస్తున్నాను.  తప్పుగా అనుకోవచ్చు.  ఆ డ్రెస్ నాకెంతో ఇష్టం అని చెప్పి మెసేజ్ చేస్తూ డ్రెస్ గిఫ్ట్ గా పంపించాడు.  విజయ్ పంపిన డ్రెస్ ను మెసేజ్ ను చూసి కియారా షాక్ అయ్యింది.  విజయ్ కు కృతజ్ఞతలు చెప్పింది.