ట్రోల్స్ నాకు మంచి కిక్ ఇస్తాయంటున్న రౌడీ..

ట్రోల్స్ నాకు మంచి కిక్ ఇస్తాయంటున్న రౌడీ..

'అర్జున్ రెడ్డి' సినిమాతో క్రేజీ స్టార్ గా మారిన విజయ్వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.  అయితే సినిమా ఇండస్ట్రీలో ఎంత ఎక్కవ ఎదుగుతారో అంతే ఎక్కవగా విమర్శలు కూడా ఎదురుకుంటారు. సోషల్ మీడియాలో సెలబ్రెటీల పై ట్రోల్ విపరీతంగా నడుస్తుంటాయి. చాలా మంది వాటిని పట్టించుకోరు. కొంతమంది వాటిని పట్టించుకోని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. కానీ విజయ్ దేవరకొండ మాత్రం ట్రోల్స్ పై వెరైటీగా రియాక్ట్ అయ్యాడు. 

సోషల్ మీడియాల్లో మీ పై వస్తున్న ట్రోల్స్  పై మీ అభిప్రాయం ఏంటి అని అడిగిన ప్రశ్నకు `ట్రోలింగ్ అంటే నాకు చాలా ఇష్టం. సోషల్ మీడియా ట్రోల్స్ నాకు మంచి కిక్ ఇస్తుంటాయి. నెటిజన్లు తమ విలువైన సమయాన్ని నా సినిమాలు, స్టైల్‌ను విమర్శించేందుకు ఉపయోగిస్తున్నారు. నేను వారికి చాలా నిద్రలేని రాత్రులు ఇస్తున్నాను. వారి కలల్లోకి కూడా నేను వస్తానేమో అనిపిస్తుంది. అని విజయ్ అన్నాడు.