ఇంటర్వ్యూ : అందులోకి నన్ను లాక్కండి ప్లీజ్ - విజయ్ దేవరకొండ

ఇంటర్వ్యూ : అందులోకి నన్ను లాక్కండి ప్లీజ్ - విజయ్ దేవరకొండ

గీత గోవిందం విడుదలైన కొద్దీ రోజులకే విజయ్ నోటా రిలీజ్ కాబోతున్నది.  వరస సినిమాలు, వరస ప్రమోషన్లతో విజయ్ చాలా బిజీ అయ్యారు.  ఇంతటి బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ నోటా ప్రమోషన్లో భాగంగా మీడియా మిత్రులతో చిట్ చాట్ చేశారు.  ఈ సినిమా గురించి ఆయన ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే విందాం. 

గీత గోవిందం విజయాన్ని ఎంజాయ్ చేసేలోపే నోటా విడుదలౌతుంది కదా.. ఎలా ఫీలవుతున్నారు..?

ఒక సినిమా రిలీజ్ అయ్యి విజయం సాధించిన కొద్దీ సమయంలోనే ఇలా సినిమా రిలీజ్ కావడం చాలా ఆనందంగా ఉంది.  కొద్దిగా భయం కూడా ఉంది.  రేపు సినిమా రిలీజ్ కదా అందుకే ఈ భయం. 

సినిమాల ప్రమోషన్స్ తో చాలా బిజీ అయినట్టున్నారు..? 

గీత గోవిందం సినిమా రిలీజ్ కు ముందు చాలా వర్క్ చేశాను.  రిలీజ్ తరువాత సినిమాను ప్రమోషన్ చేశాను.. ఇప్పుడు నోటాకు చేస్తున్నా.. చాలా టైడ్ అయ్యాను.  సినిమాలు చేయాలని అనుకున్నానుగాని, ఇలా నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుందని అనుకోలేదు.  ఒక్కరోజులోనే దాదాపు 10 వీడియో ప్రమోషన్స్ చేశాను.  ఈ సినిమా రిలీజ్ అయ్యాక కాస్త రెస్ట్ తీసుకుంటా.  

నోటా ఎలా ఉండబోతున్నది..?

నోటా గురించి చాలా చెప్పాలని ఉంది కానీ ఇప్పుడు చెప్పలేను.  రియలిస్టిక్ సినిమా.  తమిళ రాయాజీయాలకు చాలా దగ్గరగా సినిమా ఉంటుంది.  కొన్ని సన్నివేశాలు రియల్ గా అనిపిస్తాయి.  పొలిటికల్ గా కాస్త నాలెడ్జ్ ఉంది.  అందుకే ఈ సినిమాను ఎంచుకున్నాను.  మాములు లవ్ స్టోరీ సినిమాలు ఎప్పుడైనా చెయ్యొచ్చు. ఇలాంటి సినిమాలు అరుదుగా దొరుకుతుంటాయి.  అందుకే వెంటనే ఒప్పుకున్నాను.  కొత్తగా ట్రై చేశాం.  తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నా. 

సినిమాల్లోనే కాకుండా.. బయట కూడా మీద కొన్ని వివాదాలు నడుస్తున్నాయి.. దానిపై కామెంట్..?

నామీద ఎందుకు వివాదాలు నడుస్తున్నాయో అర్ధం కావడం లేదు.  అందులోకి నన్ను ఎందుకు లాగుతున్నారో అర్ధం కావడం లేదు.  నన్ను ఇలా వదిలేయండి ప్లీజ్.  

సోషల్ మీడియాలో మీతో ఓ అమ్మాయి ఫోటో.. బాగా వైరల్ అయింది కదా.. ఆ అమ్మాయి ఎవరు..?

అది మార్ఫింగ్ ఫోటో కాదు.  అందులో ఉన్నది నేనే.  రెండేళ్ల క్రితం ఫోటో అది.  తను చాలా మంచి అమ్మాయి.  ఇక్కడితో ఈ విషయాన్ని మర్చిపోతే మంచిది.  

నెక్స్ట్ ప్రాజెక్ట్స్...? 

డియర్ కామ్రేడ్ చేస్తున్నాను.  మరో ద్విభాషా సినిమా చేయాలని అనుకుంటున్నా.  నోటా రిజల్ట్ ను బట్టి ఆలోచిస్తాను.