సుకుమార్ తో విజయ్ దేవరకొండ సినిమా

సుకుమార్ తో విజయ్ దేవరకొండ సినిమా

యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో విజయర్ దేవరకొండ. 'అర్జున్ రెడ్డి' సినిమా తో ఓవర్ నైట్ లో స్టార్ అయినా హీరో విజయ్ దేవరకొండ. ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న విజయ్.. తాజాగా స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ తో మూవీ అనౌన్స్ చేశాడు.ఈ చిత్రాన్ని ఫాల్కన్ క్రియేషన్స్ బ్యానర్ పై కేదార్ సెలగం శెట్టి నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ అభిమానులతో పంచుకున్నాడు. 'నాలో ఉన్న నటుడు చాలా ఎగ్జైట్ అవుతున్నాడు. నాలో ఉన్న ప్రేక్షకుడు సెలెబ్రేట్ చేసుకుంటున్నాడు. ఒక అద్భుతమైన సినిమాను అందిస్తామని గ్యారంటీ ఇస్తున్నాము. సుక్కు సార్ తో పని చేసేందుకు ఇక వేచి చూడలేను. కేదార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు. నీవు ఒక మంచి స్నేహితుడివి' అని ట్వీట్ చేశాడు.  2022లో ప్రారంభం కానున్న ఈ సినిమాని పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా విజయ్ దేవరకొండ - పూరీ కాంబినేషన్ లో 'ఫైటర్' అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమా కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్ హీరోగా పుష్ప అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే విజయ్ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈ క్రేజీ సినిమా కోసం విజయ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు .