విజయ్ దేవరకొండ "అర్జున్ రెడ్డి" తమిళ్ రిలీజ్ ఎప్పుడంటే..!!

విజయ్ దేవరకొండ "అర్జున్ రెడ్డి" తమిళ్ రిలీజ్ ఎప్పుడంటే..!!

అర్జున్ రెడ్డి సినిమాతో సౌత్ లో విజయ్ దేవరకొండ రాత్రికి రాత్రే స్టార్ అయ్యాడు.  బోల్డ్ కంటెంట్ తో ఉన్న ఈ సినిమా యూత్ కు బాగా కనెక్ట్ అయ్యింది.  సినిమా సూపర్ హిట్ కావడంతో విజయ్ దేవరకొండ కాస్త అర్జున్ రెడ్డిగా మారిపోయాడు.  అందరు ముద్దుగా రౌడీ అని పిలవడం మొదలుపెట్టాడు.  

విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డికి ముందు కొన్ని సినిమాలు చేశాడు.  అర్జున్ రెడ్డి తరువాత ఆ సినిమాలు ఒక్కొక్కటిగా రిలీజ్ అయ్యాయి.  అందులో ఒకటి ద్వారకా.  ఇందులో విజయ్ దొంగ పాత్రలో నటించాడు.  గుజరాతీ అమ్మాయి పూజా ఝవేరి హీరోయిన్.  శ్రీనివాస్ రవీంద్ర దర్శకుడు.  ఈ సినిమాలో తెలుగులో పెద్దగా ఆడలేదు.  

విజయ్ కు తెలుగుతో పాటు తమిళంలోనూ మంచి క్రేజ్ ఉంది. విజయ్ తమిళంలో నోటా సినిమా చేశాడు.  తెలుగులో సక్సెస్ కాలేకపోయినా.. తమిళంలో మంచి పేరు తెచ్చుకుంది.  విజయ్ తెలుగులో చేసిన ద్వారకా సినిమా ఇప్పుడు తమిళంలో అర్జున్ రెడ్డి పేరుతో డబ్బింగ్ చేసుకుంది.  అర్జున్ రెడ్డి అనే  పేరుకు క్రేజ్ ఉండటంతో ఈ టైటిల్ ను సినిమాకు పెట్టారు.  ఫిబ్రవరి నెలలో ఈ సినిమా రిలీజ్ కాబోతున్నది.