మూడు విభిన్న పాత్రల్లో విజయ్ దేవరకొండ..!!!

మూడు విభిన్న పాత్రల్లో విజయ్ దేవరకొండ..!!!

అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా సినిమాలతో మంచి ఊపుమీదున్న గత కొంతకాలంగా రేస్ లో వెనకబడ్డాడు.  ఈ ఆరునెలల కాలంలో ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు.  ప్రస్తుతం ఈ యువహీరో డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  

ఈ సినిమా వచ్చే నెలలో రిలీజ్ కాబోతున్నది.  దీంతో పాటు విజయ్ మరో సినిమాకూడా చేస్తున్నాడు.  క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.  సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో విజయ్ రైటర్ గా కనిపించబోతున్నారు.  మూడు కథలు చెప్తూ.. ఆ మూడింటిలో విజయ్ కనిపిస్తాడట.  

సమాచారం ప్రకారం ఒకటి కార్మిక కాయకుడిగా, రెండోది ఎంఆర్ఐ కాగా మూడో రోల్ ఏంటి అన్నది సస్పెన్స్ లో పడింది.  ఇప్పటికే దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ, త్వరలోనే రిలీజ్ కాబోతున్నది.  ఎప్పుడు అన్నది తెలియాలి.