విజయ్ కు మరో క్రేజీ ఆఫర్.. యాత్రలో బిగ్ రోల్..!!

విజయ్ కు మరో క్రేజీ ఆఫర్.. యాత్రలో బిగ్ రోల్..!!

విజయ్ దేవరకొండ.. గీత గోవిందం సినిమా తరువాత టాలీవుడ్ లో మరింత క్రేజ్ పెరిగింది.  అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ లో క్రేజ్ సంపాదించుకున్న ఈ హీరో ఇప్పుడు డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్నారు.  అటు  తమిళంలో నోటా సినిమా చేస్తూ బిజీఅయ్యాడు.  

ఈ హీరోకు ఇప్పుడు మరో ఆఫర్ వచ్చినట్టు సమాచారం.  మలయాళం హీరో మమ్ముట్టి హీరోగా నటిస్తున్న యాత్ర సినిమాలో విజయ్ ఓ ప్రముఖ రోల్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ ఎలాంటి పాత్రలో నటిస్తున్నారు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.  సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా నిర్మితమైన మహానటి సినిమాలో విజయ్ ఫోటోగ్రాఫర్ పాత్రలోనటించాడు.   వైఎస్సాఆర్  జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందుతున్నది.  వైఎస్సాఆర్ తండ్రి రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు కనిపిస్తున్నారు.