విసిగిపోయానంటున్న విజయ్ దేవరకొండ !

విసిగిపోయానంటున్న విజయ్ దేవరకొండ !

వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ సంచలనం విజయ్ దేవరకొండ.  ఆయన నటించిన తాజా చిత్రం 'గీత గోవిందం' బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా నడుస్తోంది.  ఇప్పటికే 45 కోట్లు దాటేశాయి ఈ చిత్ర వసూళ్లు.  వరుసగా షూటింగ్స్, సినిమా ప్రమోషన్లతో చాలా రోజుల నుండి తీరిక లేకుండా గడుపుతున్నాడు విజయ్. 

ఈ బిజీ షెడ్యూల్స్ వలన విసుగొచ్చేసింది, అందుకే బ్రేక్ కోరుకుంటున్నానన్న విజయ్ త్వరలో యూరప్ యాత్రకు వెళుతున్నాడట.  10 రోజుల పాటు ఉండనున్న ఈ టూర్లో ఆయన ఫోన్ కూడ ఆఫ్ చేసి ప్రశాంతంగా గడపాలని భావిస్తున్నాడట.  ఇకపోతే విజయ్ ప్రస్తుతం ద్విభాషా చిత్రం 'నోటా'తో పాటు మరొక సినిమా 'డియర్ కామ్రేడ్'లో నటిస్తున్నాడు.