వంశీ పైడిపల్లితో విజయ్ దేవరకొండ!?

వంశీ పైడిపల్లితో విజయ్ దేవరకొండ!?

మహేశ్ తో 'మహర్షి' వంటి హిట్ సినిమా తీసిన వంశీ పైడిపల్లి తదుపరి సినిమా ఏమిటనేది ఇంత వరకూ తెలియలేదు. ఆ మధ్య మళ్ళీ మహేశ్ తోనే సినిమా ఉంటుందని వినిపించినా... ఎందుకో ఏమో ఇంకా అది వర్కవుట్ కాలేదు. 'మున్నా'తో డైరక్టర్ అయిన వంశీ పైడిపల్లి తన 13 ఏళ్ళ కెరీర్ లో ఐదే ఐదు సినిమాలు డైరెక్ట్ చేశారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ తో వంశీ పైడిపల్లి సినిమా చేస్తున్నాడని వినిపిస్తోంది. ఈ సినిమా దిల్ రాజు బ్యానర్ లో ఉంటుందని సమాచారం. విజయ్ ప్రస్తుతం పూరీ దర్శకత్వంలో 'లైగర్' అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత సుకుమార్ తో ఓ సినిమా... శివ నిర్వాణ తో మరో మూవీ కమిట్ అయ్యాడు. 'లైగర్' తర్వాత సుకుమార్ సినిమా మొదలయ్యే లోపు వంశీ పైడిపల్లి సినిమా పూర్తిచేస్తాడట. ఇందులో నిజానిజాలేంటనేది తెలియాలంటే అధికారికంగా ప్రకటన వచ్చే వరకు చూడాల్సిందే.