ఈ లవర్ కూడా అర్జున్ రెడ్డిలా ఉన్నాడే..!!

ఈ లవర్ కూడా అర్జున్ రెడ్డిలా ఉన్నాడే..!!

విజయ్ దేవరకొండ ... క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా వరల్డ్ ఫేమస్ లవర్.  ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నది.  దీనికి సంబంధించిన టైటిల్ ను ఇటీవలే ప్రకటించారు.  వరల్డ్ ఫేమస్ లవర్ అనే టైటిల్ ను చూడగానే ఇది కూడా లవ్ స్టోరీతో నిండిపోయి ఉంటుంది అనుకున్నారు.  పైగా ఇందులో నటించే హీరోయిన్ల జాబితా చాలా ఉన్నది.  దీంతో విజయ్ ఎవరితో లవ్ లో పడతారో అనే ఆలోచనలో పడ్డారు అయన అభిమానులు. 

కాగా, ఇప్పుడు ఫస్ట్ లుక్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు.  మాసిన గడ్డం, రేగిన జుట్టు , ముఖంపై రక్తపు మరకలు.. ఎమోషన్ గా ఉన్న ఆ ఫోటోను చూస్తే ...  అర్జున్ రెడ్డి సినిమా గుర్తుకు వస్తుంది.  ఈ సినిమాను కూడా అదే టైప్ లో లవ్ స్టోరీగా తీస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.  విజయ్ అర్జున్ రెడ్డి మానియా నుంచి ఇంకా బయటకు రావడం లేదని కొందరు అంటున్నారు. ఈ రౌడీగారి వరల్డ్ ఫేమస్ లవర్ కథ ఏంటో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.