స్పీడ్ పెంచిన విజయ్ దేవరకొండ 

స్పీడ్ పెంచిన విజయ్ దేవరకొండ 

తెలుగు యువ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న గీతగోవిందం చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఆగష్టు 15న రిలీజ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమా కేవలం పోస్టర్స్ తోనే మంచి హైప్ ను క్రియేట్ చేసుకుంది. 

మరోవైపు తమిళ దర్శకుడు ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం నోటా చేస్తున్నాడు. ప్రస్తుత రాజకీయాల నేపథ్యంతో ఉండనున్న ఈ చిత్రంలో విజయ్ సరసన మెహ్రీన్ నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తి కావొచ్చింది. విజయ్ ఇదే కాకుండా నూతన దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో టాక్సీ వాలా సినిమాను చేశాడు. ఈ ప్రాజెక్టు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమైంది. వీటిలో మొదటగా గీతగోవిందంను రిలీజ్ చేసి..ఆ తరువాత మిగిలిన రెండు సినిమాను సిద్ధం చేయనున్నాడు. చూస్తుంటే వచ్చే మూడు నాలుగు నెలలో విజయ్ దేవరకొండ వరుసగా సినిమాలతో ప్రేక్షకులను అలరించనున్నాడని అర్థమవుతోంది.