ఈసారికి నేను హీరో అంటున్న దేవరకొండ !

ఈసారికి నేను హీరో అంటున్న దేవరకొండ !

యువ హీరో విజయ్ దేవరకొండ ఈరోజు తన కొత్త చిత్రాన్ని స్టార్ట్ చేశారు.  ఈ చిత్రానికి 'హీరో' అనే టైటిల్ ఫిక్స్ చేశారు.  స్పోర్ట్స్ నేపథ్యంలో ఈ చిత్రం ఉండనుంది.  ఆనంద్ అన్నామలై ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు.  ఇందులో బైక్ రేసింగ్ కాన్సెప్ట్ ప్రధానంగా ఉంటుందని తెలుస్తోంది.  తమిళ నటి మాళ‌వికా మోహ‌న‌న్ ఈ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనుంది.  ప్ర‌దీప్‌ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ముర‌ళి గోవింద రాజులు సినిమాటోగ్ర‌ఫీ చేస్తున్నారు.  మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ చిత్రం రూపొందనుంది.