విజయ్ దేవరకొండ ఏం చేస్తున్నాడో తెలుసా ?

విజయ్ దేవరకొండ ఏం చేస్తున్నాడో తెలుసా ?

 

యువ హీరో విజయ్ దేవరకొండ కొత్తగా స్టార్ చేసిన చిత్రం 'హీరో'.  తెలుగు, తమిళం రెండు భాషల్లో రూపొందనున్న ఈ సినిమాను ఆనంద్ అన్నామలై డైరెక్ట్ చేయనున్నారు.  బైక్ రేసింగ్ నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాలో రేసింగ్ సన్నివేశాలు ఎక్కువగా ఉండనున్నాయి.  అందుకే విజయ్ ముందుగా రేసింగ్ పాఠాలు నేర్చుకుంటున్నాడు.  అది కూడా అంతర్జాతీయ స్థాయి రోడ్  రేసింగ్  ఛాంపియన్ అయిన రజిని కృష్ణన్ వద్ద కావడం విశేషం.  మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమిళ నటి మాళవిక మోహనన్ కథానాయకిగా నటించనుంది.