‘పుష్ప’ తర్వాత.. సుకుమార్ తదుపరి సినిమా క్లారిటీ!

‘పుష్ప’ తర్వాత.. సుకుమార్ తదుపరి సినిమా క్లారిటీ!

దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ‘పుష్ప’ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో బన్నీ.. లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో నటిస్తున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలావుంటే ఈ సినిమా తర్వాత దర్శకుడు సుకుమార్ ఎవరితో చేయనున్నాడనే వార్తలకు క్లారిటీ వచ్చినట్లుగా టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. పుష్ప తర్వాత సుకుమార్.. తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఖరారు అయినట్లుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మరికొద్ది రోజుల్లోనే దీనిపై ప్రకటన వస్తుందనే ప్రచారం కూడా జరుగుతోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ దర్శకత్వంలోని ‘లైగర్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత సుకుమార్- విజయ్ కాంబినేషన్ ఉండనుందని తెలుస్తోంది.!!