సారీ జెట్ : విజయ్ మాల్యా

సారీ జెట్ : విజయ్ మాల్యా

ప్రముఖ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్‌ అప్పుల్లో కూరుకుపోయిన సంగతి తెలిసిందే.  ఈ అంశంపై స్పందించిన విజయ్ మాల్యా జెట్ ఎయిర్‌వేస్‌ మూతబడటానికి ప్రభుత్వమే కారణమని అన్నారు.  కేవలం ప్రైవేట్ సంస్థ అయినందునే ప్రభ్యుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు.  తమకు ప్రధాన పోటీదారు అయినప్పటికీ జెట్ ఎయిర్‌వేస్‌ పరిస్థితి పట్ల బాధగా ఉందని అన్నారు.  నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను కాపాడటానికి ప్రభుత్వం 35 వేల కోట్ల ప్రజాధనాన్ని వాడుతోందని అన్నారు.  ఇక తన బకాయిల విషయమై మాట్లాడుతూ నేను లండన్లో ఉన్నా ఇండియన్ జైల్లో ఉన్నా పూర్తి బకాయిలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాను.  కానీ బ్యాంకులు మాత్రం డబ్బు తీసుకోవట్లేదు ఎందుకని ప్రశ్నించారు.