ఆర్సీబీకి కొత్త లోగో... విజయ్‌ మాల్యా సెటైర్లు..!

ఆర్సీబీకి కొత్త లోగో... విజయ్‌ మాల్యా సెటైర్లు..!

ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు కొత్త లోగోను ఆవిష్కరించి అందరినీ ఆకట్టుకుంది. లోగో ఆవిష్కరణ వీడియోను ట్వీట్‌ చేస్తూ కొత్త శతాబ్దం.. కొత్త ఆర్సీబీ.. కొత్త అధ్యాయం అని పోస్ట్‌ చేసింది. ఇది చూసిన విజయ్‌మాల్యా గొప్పగా ఉందంటూనే.. ట్రోఫీ గెలవండని సెటైర్‌ వేశాడు. ఆర్సీబీ పోస్టు చేసిన మరో ట్వీట్‌ను మాల్యా రీట్వీట్‌ చేశాడు. అందులో ఆ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని పొగడ్తలతో ముంచెత్తాడు. అండర్‌-19 జట్టు నుంచే విరాట్‌ కోహ్లీ ఆర్సీబీలోకి వచ్చాడని అన్నాడు. అతడు టీమ్‌ఇండియాకు అత్యుత్తమ విజయాలు అందించి జట్టును విజయ పథంలో నడిపిస్తున్నాడని చెప్పాడు. ఇప్పుడు కోహ్లీని స్వేచ్ఛగా వదిలేయాలని ఆర్సీబీకి సూచించాడు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అభిమానులందరికీ ట్రోఫీ కావాలి అని తనదైన శైలిలో స్పందించాడు.