భారత్ కు తిరిగివచ్చే ఆలోచనలో మాల్యా?

భారత్ కు తిరిగివచ్చే ఆలోచనలో మాల్యా?

బ్యాంకులను నిండా ముంచి లండన్ పారిపోయిన లిక్కర్ కింగ్, రాజ్యసభ మాజీ సభ్యుడు విజయ్ మాల్యా భారత్ కు తిరిగి వచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. మాల్యాను తిరిగి భారత్ కు అప్పగించే విషయంలో ఇప్పటికే లండన్ కోర్టులో కేసు నడుస్తుంది. త్వరలోనే ఈ కేసు తీర్పు కూడా రానుంది. ఈ నేపధ్యంలో తాను భారత్ కు వచ్చేస్తానని, తనపై నమోదైన కేసుల విచారణకు స్వయంగా హజరుకావాలని అనుకుంటున్నాడు. ఇప్పటికే ఈ విషయంపై అధికారులకు కూడా సమాచారం అందిచాడని సమాచారం. మాల్యాను ఆర్ధిక నేరగాడిగా ముద్ర వేయడంతో పాటు ఆయనకు చెందిన రూ.12,500 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను స్వాధీనపర్చుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ముంబైలోని ప్రత్యేక కోర్టును కోరింది. దీనిపై విచారణ వచ్చే నెల 27వ తేదిన స్వయంగా హజరుకావాలని కోర్టు సమన్లు కూడా జారిఅయ్యాయి. విచారణకు హజరుకాకపోతే కోర్టు మాల్యాను పరారీ ఆర్ధిక నేరగాడిగా ప్రకటించి, ఆయన ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. దీంతో మాల్యా భారత్ కు రావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.