పారిపోయే ముందు బీజేపీ నేతలతో మాల్యా భేటీ
బ్యాంకులకు వేల కోట్లు ముంచి విదేశాలకు పారిపోయిన పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా విషయంలో మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. దేశం విడిచి పారిపోయే ముందు బీజేపీ నేతలతో మాల్యా భేటీ అయ్యారని ఆయన ఆరోపించారు. లండన్లో ప్రముఖ పారిశ్రామికవేత్తలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ నేతలతో మాల్యా భేటీ అయినట్లు రికార్డుల్లో ఉందని, అయితే వారి పేర్లను తాను మాత్రం బయటపెట్టనని రాహుల్ అన్నారు. విజయ్ మాల్యాకు తగిన జైళ్ళు భారత్లో ఉన్నాయని, భారత్లో అందరికి చట్టాలు సమానమని ఆయన అన్నారు. నీరవ్ మోడీ, మెహుల్ చోక్కీల గురించి ప్రస్తావిస్తూ...రూ. 35,000 కోట్లతో వారు పారిపోయారని అన్నారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వీరు ఎంత మందికి ఉపాధి కల్పించారని రాహుల్ ప్రశ్నించారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)