మాల్యా మరో మాస్టర్‌ ప్లాన్‌..! ఈసారి ఇలా...

మాల్యా మరో మాస్టర్‌ ప్లాన్‌..! ఈసారి ఇలా...

భారతీయ బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకుంటున్న విజయ్‌ మాల్యా... మరో మాస్టర్‌ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. మాల్యాను భారత్‌కు అప్పగించాల్సిందేనని.. బ్రిటన్‌ సుప్రీం కోర్టు కూడా తీర్పు చెప్పడంతో తన దగ్గరున్న మరో అస్త్రాన్ని బయటకు తీసినట్టు తెలుస్తోంది. మానవతా దృక్పథంతో తనను లండన్‌లో ఉండేలా అవకాశం కల్పించాలని.. మాల్యా  కోర్టులో శరణార్థి పిటిషన్‌ దాఖలు చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ పిటిషన్‌ ప్రాసెస్‌ కావడానికే ఆర్నెళ్ల సమయం పట్టే అవకాశం ఉంటుంది. తిరస్కరిస్తే రివ్యూ పిటిషన్‌ వేసే చాన్స్‌ కూడా ఉంటుంది. దీంతో మాల్యా ఇప్పట్లో భారత్‌కు రావడం కష్టంగానే అనిపిస్తోంది. ఎప్పటికప్పుడు భారత్ కి రాకుండా విజయ్ మాల్యా తప్పించుకుంటున్న సంగతి తెలిసిందే.