ఫ్లాప్ టాక్ తో రికార్డ్స్ బ్రేక్

ఫ్లాప్ టాక్ తో రికార్డ్స్ బ్రేక్

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం 'మాస్టర్' సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తమిళ తెలుగు భాషల్లో జనవరి 13న రిలీజ్ అయింది. 'ఖైదీ' ఫేమ్ లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై మొదటి నుంచి కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. అయితే  'మాస్టర్' సినిమా తెలుగు రాష్ట్రాల్లో డివైడ్ టాక్ ను తెచ్చుకుంది. అయినప్పటికీ మంచి ఓపెనింగ్స్ రాబట్టి అందరినీ ఆశ్చర్య పరిచింది. నెగిటివ్ ఫీడ్ బ్యాక్ తో కూడా మంచి వసూళ్లను అందుకుందని తెలుస్తోంది. సంక్రాంతి సీజన్ కావడంతో ఈ సినిమాకు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. కరోనా నిబంధనలతో 50 % ఆక్యుపెన్సీకి మాత్రమే పరిమితమైన సిట్టింగ్ తో ఇలాంటి వసూళ్లు రాబట్టుకోవడం పట్ల ట్రేడ్ నిపుణులు సైతం ఆశ్చర్యపోతున్నారు.