వెలుగుచూసిన 'మెర్సల్' సినిమా మోసం !

 వెలుగుచూసిన 'మెర్సల్' సినిమా మోసం !

తమిళ స్టార్ హీరో విజయ్ చేసిన 'మెర్సల్' సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో తెలిసిన సంగతే.  జిఎస్స్టీ పథకాన్ని కించపరిచేలా కంటెంట్ ఉందని విడుదల సమయంలో ఈ సినిమాపై అనేక వివాదాలు లేచాయి.  తాజాగా మరోసారి కూడ ఈ సినిమాపై కొత్త వివాదం బయటికొచ్చింది. 

ఈ సినిమాలో మూడు గెటప్స్ లో విజయ్ అలరించాడు.  అందులో మెజీషియన్ పాత్ర కూడ ఒకటి.  ఈ పాత్రకు సంబందించిన సన్నివేశాల చిత్రీకరణ కోసం ప్రముఖ మెజీషియన్ రమణ శర్మను తీసుకున్నారు నిర్మాతలు.  రమణ శర్మ 5 నెలలపాటు ఈ సినిమా కోసం పనిచేశారు.  కానీ ఇప్పటి వరకు ఆయనకు ఇవ్వాల్సిన 4 లక్షల పేమెంట్ మాత్రం ఇవ్వలేదట తేనండాల్ సంస్థ. 

ఈ విషయాన్నే చెబుతూ రమణ శర్మ ట్విట్టర్లో వరుసగా ట్వీట్లు చేస్తూ అవినీతి మీద తీసిన సినిమా నిర్మాతలు ఇచ్చిన మాటను తప్పారు.  ఇప్పటి వరకు నాకు ఇవ్వాల్సిన పేమెంట్ ఇవ్వలేదు.  ఇది ఎంతవరకు సమంజసం.  దీనిపై న్యాయపోరాటం చేస్తాను అంటూ నిర్మాణ సంస్థతో గతంలో జరిపిన ఫోన్ కాన్వర్జేషన్ ను కూడ బయటపెట్టాడు.