యూట్యూబ్లో విజయ్ మెర్సల్ సంచలనం

యూట్యూబ్లో విజయ్ మెర్సల్ సంచలనం

విజయ్ హీరోగా, అట్లీ దర్శకత్వంలో వచ్చిన సినిమా మెర్సల్.  భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా గతేడాది రిలీజయ్యి భారీ హిట్టైంది.  ఎన్నో అవార్డులు అందుకున్న ఈ సినిమా యూట్యూబ్ లో ఇప్పుడు సంచనాలు సృష్టిస్తున్నది.  

మెర్సల్ ఆల్బమ్ యూట్యూబ్లో 350 డిజిటల్ వ్యూస్ ను సొంతం చేసుకొని రికార్డ్ సృష్టించింది.  ఇంత భారీ స్థాయిలో వ్యూస్ ను సొంతం చేసుకున్న తమిళ సినిమా మెర్సల్ ఒక్కటే కావడం విశేషం.  మెర్సల్ ఈ రికార్డ్ సాధించడంతో.. ఇప్పుడు ఫ్యాన్స్ సర్కార్ పై దృష్టి పెట్టారు.  సర్కార్ ఆల్బమ్ కూడా అదే రేంజ్ లో హిట్ కావాలని కోరుకుంటున్నారు.