విజయ్ కొత్త సినిమా లాంచ్ ఎప్పుడంటే !

 విజయ్ కొత్త సినిమా లాంచ్ ఎప్పుడంటే !

 

ప్రస్తుతం 'సర్కార్' సినిమా పనుల్లో బిజీగా ఉన్న స్టార్ హీరో విజయ్ తన తరవాతి సినిమాపై కూడ ఓ కన్నేసే ఉంచాడు.  ఈ చిత్రాన్ని యువ దర్శకుడు అట్లీ డైరెక్ట్ చేయనున్నాడు.  ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాతి రోజున లాంఛనంగా ప్రారంభించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.  దీంతో విజయ్ అభిమానుల్లో కొత్త సందడి నెలకొంది.  గతంలో అట్లీ, విజయ్ కాంబినేషన్లో వచ్చిన 'తేరి, మెర్సల్' చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.