విజయ్ ప్లాన్ అదుర్స్..!!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సర్కార్ సినిమా తరువాత అట్లీతో సినిమా చేస్తున్నాడు. వీరి కాంబినేషన్లో తేరి, మెర్సల్ సినిమాలు వచ్చాయి. ఈ రెండు సూపర్ హిట్టయ్యాయి. ఇప్పుడు మూడో సినిమా తెరకెక్కబోతున్నది. ఈ సినిమా తరువాత విజయ్ .. మరో హిట్ మూవీ దర్శకుడు మోహన్ రాజా తో సినిమా చేయబోతున్నారట.
మోహన్ రాజా గతంలో తని ఒరువన్ సినిమాకు దర్శకత్వం వహించాడు. కాప్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. విజయ్.. మోహన్ రాజా కాంబినేషన్లో గతంలో వేలాయుధం సినిమా వచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్టైంది. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు కలిసి సినిమా చేయబోతున్నారు. కోలీవుడ్ లో హిట్ దర్శకులతో వరసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు విజయ్.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)