ఆ నలుగురిలో ఎవరితో విజయ్ రొమాన్స్ చేస్తున్నాడు..!!

ఆ నలుగురిలో ఎవరితో విజయ్ రొమాన్స్ చేస్తున్నాడు..!!

విజయ్ దేవరకొండ సినిమా సినిమాకు లుక్ లో వేరియేషన్స్ చూపిస్తూ దూసుకుపోతున్నాడు.  ప్రస్తుతం ఈ బంగారు కొండ.. డియర్ కామ్రేడ్ చేస్తున్నాడు.  ఇందులో స్టూడెంట్ లీడర్ గా కనిపిస్తున్నాడు.  గతంలో అర్జున్ రెడ్డి సినిమాలో అమ్మాయి కోసం తిరిగే పిచ్చివాడిగా కనిపిస్తే.. ఆ తరువాత వచ్చిన గీత గోవిందంలో డీసెంట్ మ్యాన్ గా కనిపించాడు.  నోటా సినిమాలో రాజకీయ నాయకుడిగా కనిపించిన విజయ్ .. ఆ నలుగురు, మళ్లీమళ్లీ ఇది రాజీరోజు వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు సిద్ధం అయ్యాడు.  

ఇందులో విజయ్.. సింగరేణి కార్మికుడిగా కాస్త ఏజ్డ్ పర్సన్ గా కనిపించబోతున్నాడు.  క్రాంతి మాధవ్.. విజయ్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో రాశిఖన్నా, ఇజబెల్లా, ఐశ్వర్య రాజేష్, కాథరిన్ త్రెసా లు హీరోయిన్లు.  ఈ నలుగురిలో ఎవరితో రొమాన్స్ చేస్తున్నాడు అన్నది సస్పెన్స్.  అంతేకాదు.. ఇందులో విజయ్ 8 సంవత్సరాల బాబుకు తండ్రిగా కనిపించబోతున్నాడట.