విజయ్ సర్కార్ సంచలన నిర్ణయం

విజయ్ సర్కార్ సంచలన నిర్ణయం

విజయ్ సర్కార్ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న సంగతి తెల్సిందే.  ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను కూడా మొదలు పెట్టారు.  తమిళంతో పాటు, తెలుగు, మలయాళంలో కూడా ఈ సినిమా రిలీజ్ కాబోతున్నది.  ఇదిలా ఉంటె, ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ బయటకు వచ్చింది.  సర్కార్ సినిమా దీపావళి సందర్భంగా నవంబర్ 6 న రిలీజ్ కావాలి.  కానీ, సెంటిమెంట్ కారణంగా ఈ సినిమాను నవంబర్ 6 నుంచి ప్రీ ఫోన్ చేసి నవంబర్ 2 న రిలీజ్ చేయబోతున్నట్టు సర్కార్ యూనిట్ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.  

 

నవంబర్ 2 శుక్రవారం రోజున సర్కార్ రిలీజ్ అవుతున్నది. తమిళ, తెలుగు, మలయాళం భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతున్నది.  గతంలో విజయ్ సినిమాలు తెలుగులో స్ట్రెయిట్ గా రిలీజ్ కాలేదు.  కత్తి సినిమా తెలుగు రీమేక్ హక్కులను తీసుకొని మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150 సినిమా చేశారు.  ఇకపై అలాంటి అవకాశం ఉండకపోవచ్చు.  మెర్సల్ సినిమా తెలుగులో కూడా మంచి విజయం సాధించడంతో.. విజయ్ సినిమాలను ఇకపై తమిళంతో పాటు తెలుగులో కూడా స్ట్రెయిట్ గా రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు.