విజయ్ నయా గెటప్.. అదుర్స్ గురూ..!!

విజయ్ నయా గెటప్.. అదుర్స్ గురూ..!!

విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ప్రతి సినిమాలోనూ ఏదో ఒక ప్రత్యేకతను కలిగి ఉంటాడు.  ప్రయోగాలు చేయడంలో దిట్ట.  పిజ్జా వంటి చిన్న సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యి డిఫరెంట్ కాన్సెప్ట్ తో కూడిన సినిమాలు చేస్తూ కోలీవుడ్ లో టాప్ హీరోగా ఎదిగాడు.  ఇప్పుడు ఆయన చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి.  ఒక్క కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లోను సినిమాలు చేస్తున్నాడు.  

సైరా మూవీ లో ఓ స్పెషల్ క్యారెక్టర్ చేస్తున్నాడు ఈ యువహీరో.  కడైసి వివాసయే సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.  గళ్ళ చొక్కా, పైన పూల చొక్కా, మెడలో రుద్రాక్ష, లోపల తాయత్తులు, చేతికి అనేక గడియారాలు, వేళ్ళకు ఉంగరాలు.. మాసిన లుంగీ, కండువా.. కాలికి అక్కడక్కడా గాయాలు చూస్తుంటే అన్నింటిని త్యజించిన పిచ్చి సన్యాసిలా ఉన్నాడు.  ఈ గెటప్ ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ గా మారింది.