నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది

నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది

టీమిండియా యువ ఆల్ రౌండర్ విజయ్ శంకర్ గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడు. త్వరలో ఇంగ్లాండ్ లో జరగబోయే ప్రపంచకప్ టోర్నీకి ఎంపికయ్యాడు. సోమవారం బీసీసీఐ ప్రకటించిన 15 మంది సభ్యుల భారత జట్టులో విజయ శంకర్ చోటు సంపాదించాడు. ప్రపంచకప్‌ ఆడే భారత జట్టులో నెం.4 స్థానంలో ఎవరు బ్యాటింగ్‌కి వస్తారనే విషయంలో కాస్త స్పష్టత వచ్చినట్లే కనిపిస్తోంది. ఆస్ట్రేలియాతో స్వదేశంలోనూ, విదేశంలోనూ జరిగిన వన్డే సిరీస్‌లో నిలకడగా రాణించిన విజయ్ శంకర్‌కు బీసీసీఐ ప్రపంచకప్ జట్టులో చోటు కల్పించింది. దీంతో నెం.4 స్థానంపై ఉన్న ఉత్కంఠకు దాదాపు తెరపడినట్లు అయింది. 

ప్రపంచకప్ జట్టులో చోటుదక్కడంపై విజయ్‌ శంకర్‌తో పాటు, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అభిమానులు తెగ సంతోషపడుతున్నారు. ‘ప్రపంచకప్‌లో పాల్గొనబోయే టీమిండియాకు ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు తొలి మెగా టోర్నీ‌. ప్రపంచకప్‌లో ఆడాలని ప్రతీ ఒక్క క్రికెటర్‌ కోరుకుంటాడు. నేను కూడా దేశం తరుపున ఆడాలని కలలు కనేవాడిని. అది ఇంత త్వరగా నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. నా జీవితంలో ఎప్పుడూ గుర్తుండిపోయే పర్యటనగా మిగిలిపోతుంది’ అంటూ విజయ్‌ శంకర్‌ పేర్కొన్నాడు.