విజయ్ మరో రికార్డు కొట్టాడు

విజయ్ మరో రికార్డు కొట్టాడు

విజయ్ తళపతి ఈ పేరుకు తెలుగులో అంతగా గుర్తింపు లేక పోయినా, తమిళంలో మాత్రం పరిచయం కూడా అక్కర్లేని పేరు. తమిళ అగ్ర హీరోల్లో విజయ్ కూడా ఒకడు. ఇటీవల విజయ్ కొత్త సినిమా మాస్టర్ వరుస రాకార్డులు బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చిత్రీకరిచంబడంది. రికార్డు కొట్టింది ఈ సినిమా కాదు. కేవలం ఈ సినిమా టీజర్ మాత్రమే ఈ రికార్డు సాధించాయి. ఈ సినిమా టీజర్ మన దేశంలో కాకుండా కొన్ని ఇతర దేశాల్లో కూడా ట్రెండ్ అయ్యి ఈ ఘనత సాధించాయి. ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ను కూడా చిత్ర బృందం విడుదల చేసింది. అయితే ఈ సినిమా ఇంకా విడుదల కావాల్సి ఉంది. సినిమా థియేటర్ల రీఓపెన్ కోసం ఈ సినిమా వేచి ఉంది. అయితే ఇటీవల విజయ్ తళపతి మరో రికార్డును తన సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాదిలో అత్యంత ఎక్కువగా రీట్వీట్ చేయబడిన ట్వీట్‌గా విజయ్ సెల్ఫీ రెకార్డు చేసింది. ఆ సెల్ఫీలో విజయ్ తన ఫాన్స్‌ కనిపించేలా ఫొటోను తీసి దాన్ని ట్వీటర్ ద్వారా షేర్ చేశాడు. అంతే ఆ ఫొటో దాదాపు 146.1 వేల సార్లు రీట్వీట్‌ అయింది. మరి అతడి సినిమా విడుదలైతే ఎంతలా రికార్డుల మోత మోగుతుందో చూడాలి.