స్టార్ హీరో డ్యూయల్ రోల్ !

స్టార్ హీరో డ్యూయల్ రోల్ !

తమిళ స్టార్ హీరో విజయ్ తన 63వ చిత్రాన్ని అట్లీ కుమార్ డైరెక్షన్లో చేస్తున్న సంగతి తెలిసిందే.  స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు.  వాటిలో ఒకటి యుక వయసులో ఉండే పాత్ర కాగా ఇంకొకటి వయసు మళ్ళిన పాత్ర.  ప్రస్తుతం వయసు మళ్ళిన పాత్రపైనే షూటింగ్ జరుగుతోంది.  ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు.  ఇందులో నయనతార  కథానాయికగా నటిస్తోంది.