గ్యాంగ్‌స్టర్ పాత్రలో స్టార్ హీరో !

గ్యాంగ్‌స్టర్ పాత్రలో స్టార్ హీరో !

తమిళ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో ఒక చిత్రం చేస్తున్నారు.  అది పూర్తికాగానే లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో ఒక సినిమాను చేయనున్నారు.  ఈసారి సినిమాలో మార్పు చూపాలని కోరుకున్న విజయ్ కనగరాజ్ చెప్పిన కథ నచ్చడంతో ఆయనకు ఆఫర్ ఇచ్చారు.  కనగరాజ్ కథ పట్ల విజయ్ అంతలా ఇంప్రెస్ అవడానికి కారణం కథలో కథానాయకుడి పాత్రేనట.  ఎందుకంటే అదొక కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ పాత్ర.  అది వినే విజయ్ సినిమాకు ఓకే చెప్పారని కోలీవుడ్ టాక్.  మరి ఇలయదళపతిని అంతలా మెప్పించిన ఆ గ్యాంగ్‌స్టర్ పాత్ర ఎలా ఉంటుందో చూడాలి.