యంగ్ డైరెక్టర్ తో విజయ్ 

యంగ్ డైరెక్టర్ తో విజయ్ 

ఇళయథలపతి విజయ్ కుమార్ ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ సినీ ఇండస్ట్రీ బంద్ తర్వాత తిరిగి షూటింగ్ ప్రారంభమైంది. ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న నేపథ్యంలో విజయ్ తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో యువ దర్శకుడు అమీన్ చెప్పిన లైన్ నచ్చడంతో ఇంప్రెస్ అయ్యాడట. ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమని..అంత బాగుంటే సినిమా చేద్దామని హామీ ఇచ్చాడట. 

విజయ్ ఇదే కాకుండా డైరక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలోను ఓ సినిమా చేయనున్నాడు. ఈయన తన తమ్ముడు జయం రవితో తీసిన థని ఒరువన్ సినిమాతో మంచి గుర్తింపు పొందాడు. ప్రస్తుతం విజయ్ తో చేయాల్సిన సినిమాపై ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇక విజయ్ ప్రస్తుతం చేస్తున్న సినిమా గురించి మాట్లాడుకుంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ప్రశ్నించేలా ఉండనుంది. గతంలో విజయ్, ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన తుపాకీ, కత్తి సినిమాలు ఎంతటి ఘన విజయం సాధించించాయో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ కాంబో కలవడంతో తమిళనాట ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. డీపావళికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటించనుండగా, కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.