శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి అంతిమయాత్ర ప్రారంభం

శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి అంతిమయాత్ర ప్రారంభం

తెలుగు సినిమా ఇండస్ట్రీ గర్వించదగిన వ్యక్తుల్లో విజయ నిర్మల గారు ఒకరు.  బాలనటిగా తన ప్రస్థానాన్ని ప్రారభించి, 1957లో వచ్చిన పాండురంగ మహత్యం సినిమాలో ప్రముఖ పాత్రను పోషించిన విజయ నిర్మల నటిగా, హీరోయిన్ గా, దర్శకురాలిగా బహుముఖ పాత్రను పోషించింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ను సాధించిన విజయ నిర్మల.. సడెన్ గా కన్నుమూసిన సంగతి తెలిసిందే.  

ఆమె లేని లోటును సినీ పరిశ్రమ జీర్ణించుకోలేకపోయింది.  రేపు ఉదయం 8 గంటలకు నానక్ రామ్ గూడాలోని కృష్ణ స్వగృహం నుంచి అంతిమ యాత్ర ప్రారంభం అవుతుంది.  చిలుకూరులోని ఫామ్ హౌస్ లో అంతిమ సంస్కారం నిర్వహించబోతున్నారు.  సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీతో పాటు మహేష్ అభిమానులు కూడా ఈ అంతిమ యాత్రలో పాల్గొంటారని సమాచారం.