"విజయరాఘవన్" టీజర్ : విజయ ఆంటోని ఎమోషనల్ ట్వీట్
విజయ ఆంటోని కొత్తగా చేస్తున్న సినిమా విజయ రాఘవన్. నూతన సంవత్సరం సందర్భంగా ఈ సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ ఇవాళ విడుదల చేసింది. ఈ సినిమా టీజర్‌ను నూతన సంవత్సర కానుకగా నాలుగు భాషల్లో రిలీజ్ చేశారు. తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఈ టీజర్ విడుదలైంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఈ టీజర్ విడుదల చేయనున్నారు. అయితే.. ఈ టీజర్ రిలీజ్ సందర్భంగా హీరో విజయ ఆంటోని ఎమోషనల్ ట్వీట్ చేశాడు. "విజయరాఘవన్ టీజర్.. మీ కోసం.. ఇది మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను... చూసి మీ ప్రోత్సాహాన్ని షేర్, కామెంట్, లైక్ రూపంలో తెలియజేయండి..మీ ప్రోత్సాహమే...నాకు బలం...2021 సమ్మర్ లో మూవీ రిలీజ్ కానుంది. " అంటూ హీరో విజయ ఆంటోని ట్వీట్ చేశాడు. కాగా..ఈ సినిమాలో విజయ్ సరసన ఆత్మికా చేసిన విషయం తెలిసిందే.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)