కొత్త మంత్రులకు విజయసాయి రెడ్డి ఫోన్లు..

కొత్త మంత్రులకు విజయసాయి రెడ్డి ఫోన్లు..

ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్ దాదాపు ఖరారు అయినట్టు తెలుస్తోంది. 25 మందితో కూడిన కేబినెట్ ఫైనల్ కాగా... కేబినెట్‌లో చోటు దక్కించుకున్న ఎమ్మెల్యేలకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఒక్కొక్కరికి ఫోన్లు చేస్తున్నారు. ఇప్పటికే బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, గౌతమ్‌రెడ్డి, సుచరితకు ఫోన్లు వెళ్లినట్టుగా తెలుస్తోంది. కాగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో.. మంత్రులు కాబోయేవారికి విజయసాయిరెడ్డి ఫోన్లు చేస్తారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపిన నేపథ్యంలో... సాయిరెడ్డి, సీఎం జగన్ కార్యాలయం నుంచి నేతలకు ఫోన్లు వెళ్తున్నాయి. అయితే, సాయంత్రం 5 గంటల తర్వాత సమాచారం ఇవ్వాలని మొదట భావించినా... ప్రమాణస్వీకారం సమయంలో కుటుంబసభ్యులు కూడా ఉండే విధంగా ముందే సమాచారం ఇస్తున్నారని తెలుస్తోంది.